రసాయన వ్యర్థాల శుద్ధిపై గీతం దృష్టి

Gitam chemical waster examine

 ప్రజాశక్తి- మధురవాడ : రసాయన వ్యర్థాల నుంచి విశాఖలోని తీరప్రాంతాలను పరిరక్షించే ప్రాజెక్టులో రీ సస్టైనబిలిటీ లిమిటెడ్‌ సంస్థ (రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ లిమిటెడ్‌) తో కలసి గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకులు పనిచేయనున్నారు. సంస్థ కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులో స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ జీవితకాల భాగస్వామిగా వ్వవహరించనుంది. తీర ప్రాంత పరిరక్షణతో పాటు ప్రయోగశాలల్లో వినియోగించే రసాయనాలను శుద్ధిచేసిన మీదటే పర్యావరణంలోకి సురక్షిత విధానంలో విడిచిపెడతారు. దీనికి సంబంధించి మంగళవారం జరిగిన కార్యక్రమంలో స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె.ఎస్‌.కృష్ణకు రీ సస్టైనబిలిటీ లిమిటెడ్‌ సంస్థ అధికారి వై.ఎన్‌.సాంబశివరావు జీవితకాల సభ్యత్వ సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కె.వేదవతి, రసాయనశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎన్‌.వి.ఎస్‌.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️