కానూరులో మలేరియా వ్యతిరేక మహోత్సవం

Jun 11,2024 13:50 #Anti-malaria mahotsava, #Kannur

ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి) : మండలం కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కానూరు అగ్రహారం గ్రామంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం కార్యక్రమం ర్యాలీని ప్రాథమిక కేంద్రం వైద్యులు హేమరాజ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోమల వల్ల ప్రజలకు వచ్చే వివిధ రకాల జ్వరాల గురించి వివరించి దోమలను లార్వా దశలోనే నాశనం చేసే విధానం తెలియజేసి ప్రజలు దోమలు కుట్టకుండా తీసుకోవలసిన తగు జాగ్రత్తలు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వైద్య సిబ్బంది సూపెర్వైజర్స్‌, ఏఎన్‌ఎం లు హెల్త్‌ అసిస్టెంట్‌, ఎం ఎల్‌ హెచ్‌ పి, ఆశా కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️