ప్రజాశక్తి – రాయచోటి టౌన్ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేసి కనీసవేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. బుధవారం నేషనల్ డిమాండ్స్ డేలో భాగంగా రాయ చోటిలోని సిఐటియు మండల కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి అధ్యక్షతన స్థానిక మున్సి పల్ కార్యాలయం నుంచి ప్రభుత్వాసుపత్రి వరకు ర్యాలీ గాకార్మికులు వెళ్లి మాన వహారం చేపట్టి బిజెపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద ర్బంగా అయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి , స్కీమ్ వర్క ర్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీసవేతనం రూ.26 వేలు పెంచి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా తీసుకురావడం దుర్మార్గమని తెలిపారు. అత్యంత దుర్మార్గమైన చర్యని భావించారు. కార్మికులు ఉద్యోగుల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా చేయడం దారుణమని తెలిపారు. దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయి వేటీకరించడం వారి చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్ యూని యన్ జిల్లా అధ్యక్షులు బివి రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్, విద్యుత్, ఆశా, కాంట్రాక్టు అవుట్ స్సోర్సింగ్ ఆప్ కాసు ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, జిల్లాలో రాజకీయ తొలగింపులు వేధింపులు వెంటనే ఆపాలని హెచ్చరించారు. మున్సిపల్ విద్యుత్,అంగన్వాడీలు, ఆశా మధ్యాహ్న భోజనం, సర్వ శిక్ష ,గ్రామాసేవకులు, ప్రకతి వ్యవసాయ వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లతో పాటు విద్య, వైద్య రంగంలో పనిచేసే వారందరికి జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కలిగించాలని కోరారు. ఆటో, హమాలీ ,బిల్డింగ్, తోపుడు బండ్లు తదితర అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ ఉపాధ్యక్షుడు యం.చెన్నయ్య, వై.శంకరయ్య, కోశాధికారి సి.రాంబాబు ప్రకతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుకర్ విద్యుత్ రంగం నాయకులు గౌడ్, గంగాధర్, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు సిద్దమ్మ, భాగ్యలక్ష్మి, విజయమ్మ, అరుణ, నాగమణి, సుమలత గ్రామాసేవకులు నరసింహులు, రామ్మోహన్, గ్రామపంచాయతీ కార్మికులు శ్రీరాములు, సుభద్రమ్మ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటలక్ష్మి, కేశమ్మ, లక్ష్మిదేవి, ఇంజినీరింగ్ కార్మికులు ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. బి.కొత్తకోట : జాతీయ కోరికల దినోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సిఐటియు డిమాండ్స్ డే కార్యక్రమాలు చేపట్టిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు పేర్కొన్నాన్నారు. కార్మిక ప్రదర్శన, ధర్నాను నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యావత్తు కార్మికవర్గానికి వర్తించే కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌గా మార్చిందని, సంఘాలు పెట్టకుండా, సమ్మెలు చేయకుండా కార్మికులను బానిసలుగా మార్చి పనులు చేయించాలని లేబర్‌కోడ్‌లు తెచ్చిందని వివరిం చారు. లేబర్‌కోడ్‌లు అమలు చేయాలని ఉత్తర్వులివ్వడానికి ఇప్పటి వరకూ భయపడిన బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తర్వులు ఇవ్వడానికి దస్త్రం దులిపిందని అగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శ్రీవాణి, అధ్యక్షురాలు కుమారి, శాంతమ్మ, నీలిమ, శారద పాల్గొన్నారు. రైల్వేకోడూరు : సిఐటియు కేంద్ర కమిటీ, కార్మిక డిమాండ్స్ డే పిలుపు మేరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా కార్మికుల ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, సిహెచ్. చంద్రశేఖర్,సిఐటియు జిల్లా నాయకులు, ఎపిఎండిసి, జెఎసి పోరాట కమిటీ, కన్వీనర్ రేకులకుంట వెంకటేష్, సిఐటియు, మండల అధ్యక్షులు, సి.పుల్లయ్య, ఉపాధ్యక్షులు, లింగాల యానాదయ్య, సహాయ కార్యదర్శి, ముత్యాల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు, నారదాసు సుబ్బరాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు, పి జాన్ ప్రసాద్. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్, రాజశేఖర్, విద్యుత్ కార్మిక నాయకులు, కుమార్ రాజా, ఎం సుబ్బరాయుడు, శివారెడ్డి, వెంకటేష్, మధుసూదన్, ఏపీఎండిసి, జేఏసీ నాయకులు, వర్మ, మంగంపేట మైనింగ్ వర్కర్స్ త్రివేణి, నాయకులు, శివ, వీఆర్‌ఏ సంఘం, కార్యదర్శి, లక్ష్మీకర్, నాగరాజు, బలరాం, ఆనిమేటర్స్ సంఘం ఐకెపి, నాయకులు నగరిపాటి ఆనంద్, పంచాయతీ గ్రీన్ అంబాసిడర్ నాయకులు బొజ్జ శివయ్య,పాల్గొన్నారు.
