పెద్ద దర్గాను దర్శించుకున్న అన్వేష్ రెడ్డి

Jan 16,2025 16:10 #anveshreddy

ప్రజాశక్తి – కడప అర్బన్ : నగరంలోని అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా)ను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి గురువారం దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమగల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  ఈ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ పాల్గొన్నారు.

➡️