ప్రజాశక్తి – ఆదోని : రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అజయ్ బాబు, పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ అన్నారు.
శుక్రవారం మాసా మసీద్ కాలనీయందు మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ, భారత రాజ్యాంగ పరిరక్షణకై సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార ఆందోళన నిర్వహించారు. ఈకార్యక్రమములోసిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు పట్టణ కార్యదర్శి సుదర్శన్,.సిపిఐ సీనియర్ నాయకులు షేక్షా వలి, సహాయ కార్యదర్శి విజయ్ ఇన్సాఫ్ కమిటీ నాయకులు షాషావలి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ వాక్స్ బిల్లు చట్టాన్ని వ్యతిరేకిస్తూప్రతిపక్షాలు సూచించిన పరిగణలోకి తీసుకోకుండా వివాదాస్పదమైన చట్టాన్ని అర్థరాత్రి సమయంలో మోడీ ప్రభుత్వం ఆమోదింప చేసిందని, ఇందుకోసం పార్లమెంటు ఉభయ సభలను బుల్లోజ్ చేసిందని విమర్శించారు. మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న బిజెపి మతం పేరిట విభజించేందుకు స్పష్టమైన ప్రయత్నం చేస్తుందని అన్నారు.
విభజించి పాలించు విధానాన్ని అనుసరిస్తూ మైనార్టీ వ్యతిరేక రాజకీయాలను అవలంబిస్తున్నట్లు మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా అక్షేపించింది. వక్ఫ్ బిల్లుపై చర్చ సమయంలో మైనార్టీలకు సాధికారత కోసం వినియోగిస్తామని బిజెపి నేతలు బూటకపు హామీలు ఇస్తున్నారని అన్నారు. ముస్లింల సంక్షేమం కోసం పెద్దయుత్తున నిధులు ఖర్చు చేస్తామని హామీలు ఇస్తూ మైనార్టీలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారి మాటలలో ఏమాత్రం నిజస్వరూపం కనిపించడం లేదని, మతతత్వాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రయోగం ఎన్ని రోజులు చేసినా ప్రయోజనం శూన్యం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
