ఐటిడిఎ పిఒ గా చేయాలన్నది నా కల
కోచింగ్ లేకుండానే అనుకున్న లక్ష్యాన్ని సాధించా
గిరిజనులు మానసికంగా చాలా బలవంతులు
సబ్ కలెక్టర్, ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీ వాత్సవ
ప్రజాశక్తి – పార్వతీపురం : నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే చిత్తశుద్ధి, అంకితభావం వుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు ఆ యువ ఐఎఎస్ అధికారి. ఐఎఎస్ సాధించడానికి ముందు ఎన్ని ఉద్యోగాలొచ్చినా సంతృప్తి చెందకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన పరితపించారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినప్పటికీ ఎలాంటి కోచింగ్ లేకుండానే లక్ష్యసాధన కోసం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐదో ప్రయత్నంలో సఫలీకతులయ్యారు. ఆయన కృషి పట్టుదల యువతరానికి స్ఫూర్తిదాయకం కానున్నాయి. ఆయనే సబ్ కలెక్టర్, పార్వతీపురం ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీ వాత్సవ. ఆయన జీవన గమనంలో సాధించిన విజయాలపై ఈ వారం జీవన కథనం.కుటుంబ నేపథ్యం …అశుతోష్ మిశ్రా స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలి యర్ పట్టణం. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. తండ్రి ప్రదీప్ శ్రీ వాత్సవ న్యాయవాది. అనా రోగ్యంతో మతి చెందారు. తల్లి అర్చనా శ్రీవాత్సవ గహిణి. అన్నయ్య అంకిత్ శ్రీవాత్సవ ప్రయివేటు ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాన్న న్యాయవాది అయినా పెద్దగా ప్రాక్టీస్ వుండేది కాదు. దీంతో కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఐఎఎస్ సాధించాలనే లక్ష్యంతో చదివారు. విద్యాభ్యాసం1991 ఫిబ్రవరి 6న ఆయన జన్మించారు. విద్యాభ్యాసమంతా గ్వాలియర్‌లో సాగింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకున్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ కేంద్రీయ విద్యాలయంలో పూర్తి చేశారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మాధవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో బిఇ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశారు. ఉద్యోగ నేపధ్యం ఇంజనీరింగ్ పూర్తి కాగానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష ద్వారా అశుతోష్ శ్రీ వాత్సవ ఆడిటర్ ఉద్యోగం సాధించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లో ఆడిటర్ ఉద్యోగంలో చేరారు. తర్వాత మధ్యప్రదేశ్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష లో ప్రతిభ చూపి డిఎస్‌పి ఉద్యోగం సాధించారు. ఈ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతునే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టారు. మొదటి రెండు ప్రయత్నాలలో సాధించలేకపోయినా కృషి, పట్టుదలతో .మూడో ప్రయత్నం లో ఇండియన్ రైల్వే అండ్ ట్రాఫిక్ సర్వీసెస్ సాధించారు. దీంతోనూ సంతప్తి చెందకుండా నాలుగో సారి ప్రయత్నం చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సాధించారు. అయినా ఆగకుండా ఐదో ప్రయత్నం లో 2020లో ఐఎఎస్ సాధించారు. తర్వాత పాడేరు లో ట్రయినీ కలెక్టర్ గా, 2023 లో కొవ్వూరు సబ్ కలెక్టర్ గా చేరారు. ఆ తర్వాత పార్వతీ పురం సబ్ కలెక్టర్ గా వచ్చారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధిం వచ్చు నని శ్రీవాత్స వ్ అంటున ా్నరు.
యువతకు అశుతోష్ శ్రీవాత్సవ్
సందేశంసాధించాలనే తపన,పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని, ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ధేశించుకున్నప్పుడు ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా అధిగమించవచ్చునని ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. దురలవాట్లకు దూరంగా వుంటూ లక్ష్యసాధన దిశగా అడుగులు వేయాలని యువతకు సూచించారు. .తాను ట్రయినీ కలెక్టర్ గా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో తిరిగానని, మారుమూల గిరి శిఖర గ్రామాల్లో పర్యటించి గిరిజనుల జీవన స్థితిగతులు పరిశీలించానని తెలిపారు. గిరిజనులు మానసికంగా చాలా బలవంతులని, అందుకే వారు కనీస మౌలిక సదుపాయాలు లేని కొండకోనల్లో జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పని చేసే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాననని చెప్పారు. గిరిజనులు అమాయకులు, మంచి మనసున్న వాళ్ళు అని, వారి సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి తగినంత కృషి చేస్తానని ఆయన తెలిపారు.