ప్రజాశక్తి – కడప అర్బన్ కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆధ్వర్యంలో విజన్ స్వర్ణ ఆంధ్ర-2047లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న 182 మంది విద్యార్థులు , 486 మంది విద్యార్థినులు, ఉప విద్యా శాఖ అధికారి, 50 మంది గైడ్ టీచర్స్ ల బందం ఆంధ్ర ప్రదేశ్ దర్శన్ , కడప నుంచి అరకు వరకు అనే విద్యా విజ్ఞాన విహార యాత్రను ఈ నెల 4 వెళ్లారు. శుక్రవారం ఈ యాత్ర విజయవంతమైంది. మొదటి రోజు కడప నుంచి బయలు దేరిన బందం 4న రాత్రి శ్రీ కాళహస్తికి చేరుకుని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలులో ఏర్పాటు చేసిన వసతి గహాల్లో బస చేశారు. 5న శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనం అనంతరం శ్రీ హరి కోట లో మిషన్ కంట్రోల్ సెంటర్ , రాకెట్ లాంచింగ్ ప్యాడ్ 1,2ను సందర్శించారు. చిలకలూరిపేట లోని ఎఎంజి ఇంటర్నేషనల్ హైస్కూల్ లో బస చేశారు. కొండవీడు కోటలో రెడ్డి రాజుల నిర్మించిన కోటను ,అమరావతిలో అమర లింగేశ్వర స్వామి దేవాలయం,బౌద్ధ మ్యూజియం, అమరావతి స్థూపం లను సందర్శించారు. పిఠాపురం లో కుకటేశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలను సందర్శించారు. రాత్రి శంఖవరంలో విద్యార్థులకు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంను సందర్శించి విశాఖపట్నం చేరుకున్నారు. కైలాసగిరి, సబ్ మెరైన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, రామ కష్ణ బీచ్‌ను సందర్శించారు. సింహాచలంలోని శ్రీ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం నుంచి బొర్రా గహాలకు వెళ్లారు. వివిధ రకాల కళాఆకతులు పరిశీలించి అనంతరం అరకు బయలుదేరి వెళ్లారు. రాత్రికి అరకులో మ్యూజియంను సందర్శించారు. వివిధ రకాల ఉద్యానవనాలు, వ్యూ పాయింట్లు సందర్శించారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ మ్యూజియంను విద్యార్థులు సందర్శించారు. అంబేద్కర్ జీవిత విశేషాలు, రాజ్యాంగం సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహం సందర్శన అనంతరం విజయవాడ నుంచి బయలుదేరి 8వ రోజు ఉదయం 10 గంటలకు విద్యార్థులను వారి వారి గమ్య స్థానాలకి గైడ్ టీచర్ల ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులకు, పాఠశాల ప్రధానో పాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అప్పగించారు. కలెక్టర్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటాం.. విజ్ఞానంతో కూడిన విహారయత్రకు పంపించి తమలో నూతన ఉత్సాహాన్ని కలిగించిన కలెక్టర్ శివశంకర్ లోతేటి కి మనస్ఫూర్తిగా కతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామని ‘ఏపీ దర్శన్’ (విజ్ఞాన విహారయాత్ర)కు వెళ్లి వచ్చిన విద్యార్థులు ముక్తకంఠంతో అన్నారు. వారం రోజుల పాటు రాష్టంలోని వివిధ ప్రదేశాలను కడప నుంచి అరకు వరకు సంతోషంగా సందర్శించి 500 మంది పదో తరగతి విద్యార్థులు శుక్రవారం కడపకు చేరుకున్నారు.