ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడం దారుణమని, మంత్రి నారా లోకేష్ పట్టించుకోకపోవడం ఏమిటని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు అన్నారు. గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయం గేటు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తొమ్మిది రోజులుగా క్లాప్ ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ స్పందించకపోవడం దారుణమని ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలను పరిష్కారానికి కఅషి చేయాలని కోరారు. స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న వారి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉన్నాయని తెలిపారు. క్లాప్ ఆటోలు వైసిపి ప్రభుత్వం ఉన్నంగా పెట్టినవి కాబట్టి వాటిని రద్దు చేయాలని ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని విమర్శించారు. వీధి వీధికి వెళ్లి క్లాప్ ఆటో ల వలన శుభ్రంగా వీధులు ఉంటున్నాయని అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ కాకుండా మున్సిపల్ అధికారులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. మున్సిపాలిటీ కూడా ఆదాయం పెరుగుతుందని అన్నారు. వాటిని రద్దు చేయకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత 16 నెలలుగా చెల్లించాల్సిన ఈఎస్‌ఐ, పిఎఫ్ ఆటో డ్రైవర్ల ఖాతాలో వెయ్యాలని డిమాండ్ చేశారు. జీతాలు వెంటనే చెల్లించకపోతే కోర్టుకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ చేత వెంటనే వేతనాలు వేయించాలని కోరారు. కనీస వేతనం 24,500 రూపాయలు నెలకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఒకరకంగా వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. ఏజెన్సీల ద్వారా కాకుండా మున్సిపాలిటీలే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఎలక్ట్రికల్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని అన్నారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వ వేసిన 9 మంది కమిటీ తప్పులు తడకగా ఉందని అన్నారు. అదేవిధంగా ఆప్కాశను రద్దుచేసి జీతాలు కాంట్రాక్టర్లు ఇచ్చుట వలన అనేక ఇబ్బందులు కార్మికుల గురవుతున్నారని విమర్శించారు. ఆప్కాశనావ్ రద్దు చేయకుండా ఉంచాలని కోరారు. 62 సంవత్సరాల వయసు వరకు ఉద్యోగాన్ని కొనసాగించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
కార్పొరేషన్ కార్యాలయం కి తాళాలు వేసిన అధికారులు..
కాగా కార్మికులు ఆందోళన చేసి కార్పొరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేయడానికి లోపలికి వెళ్ళడానికి వెళుతున్న కార్మికులను, యూనియన్ నాయకులను వీళ్ళనివ్వకుండా గేటుకు తాళాలు వేశారు. దీంతో కార్మికులు గేటు ముందు కూర్చుని బైఠాయించారు. కార్పొరేషన్ లోపల ఉన్న వారిని బయటకు రానివ్వకుండా, కార్మికులను లోపలికి వెళ్ళనివ్వకుండా తాళాలు వేయడంతో అధికారుల నిరంకుశ వైఖరి బయటపడింది. కార్మికులు, యూనియన్ నాయకులు ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేష్ కు, అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. దీంతో ఎట్టకేలకు కార్పొరేషన్ కమిషనర్ వినత పత్రం ఇవ్వడానికి నాయకులను లోపలికి అనుమతించారు. కార్పొరేషన్ కమిషనర్ ఎస్ ఆలీమ్ భాష కు కార్మిక సంఘాల నాయకులు వినతి పత్రాలను అందజేశారు. వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించాలని లేకపోతే లేబర్ కోర్టుకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్కు నోటీసు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య, వివి జవహర్లాల్, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ, క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు ఎం రవి, డి శివ, ఆర్ కఅష్ణ, కే నాగరాజు, జె యోహాన్, కే రాకేష్, జె శ్రీకాంత్, పి అహ్మద్ ఖాన్, మున్సిపల్ యూనియన్ నాయకులు కే శ్రీనివాసరావు, టీవీఎస్ గోపి, ఎం శ్రీనివాసరావు, కే దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.