జిపిఎస్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ను ఉపసంహరించుకోవాలి : ఎపి స్టేట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్‌

ప్రజాశక్తి -అనంతపురం క్రైం : ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకించిన గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం గతేడాది అక్టోబర్‌ 20 నుండి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్‌ విమర్శించారు. శనివారం నల్లపల్లి విజయ్ భాస్కర్‌ మాట్లాడుతూ … గత ప్రభుత్వంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు పెద్దఎత్తున పోరాటాలు చేశారని, ఉద్యోగుల పోరాటాలు అణచివేస్తూ గత ప్రభుత్వం గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ను వర్తింపచేస్తూ 54 జిఒ అమలు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పెన్షన్‌ స్కీం ను వర్తింపచేస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి ఈ రోజు గెజిట్‌ లో గ్యారెంటీడ్‌ పెన్షన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించాలని కోరారు.

➡️