అదాలత్ ద్వారా విద్యుత్ సమస్యలకు ధరఖాస్తులు

Dec 9,2024 18:03 #adalath, #Kurnool

ప్రజాశక్తి – మంత్రాలయం : విద్యుత్ సమస్యల పై అదాలత్ ద్వారా ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ శాఖ ఎఈ గోవిందు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ద్వారా అదాలత్ ను నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 10వ తేదీన మంత్రాలయంలోని సబ్ స్టేషన్ లోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం వద్ద ఉదయం 11. 30 గంటల నుండి 1.30 గంటల వరకు ఉంటుందన్నారు. విద్యుత్ సమస్యల పై రాత పూర్వకంగా ఇచ్చిన వాటిని మాత్రమే స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఎపిఎస్పిడిసిఎల్ తిరుపతి ఛైర్ పర్సన్, రిటైర్డ్ జిల్లా జడ్జి  వి. శ్రీనివాస ఆంజనేయ మూర్తి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది హాజరవుతారని ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️