ప్రజాశక్తి – బత్తలపల్లి (అనంతపురం) : మండలంలోని సంజీవపురం వద్దనున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్స రానికి 6, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ గుల్జార్ బేగం తెలిపారు. శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి కేజీబీవీలో ప్రవేశాల కోసం బాలికల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు) పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టి బిపిఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింప బడతాయన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మేసేజ్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో పరిశీలించుకోవచ్చునని ప్రిన్సిపాల్ గుల్జార్ బేగం పేర్కొన్నారు.
