ప్రజాశక్తి- రాజోలు (కోనసీమ) : తమకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మలికిపురం ఎమ్.వి.ఎన్.జె.ఎస్.ఆర్.వి.ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు గత 15 రోజులు నుంచి ధర్నా చేసున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వారు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ దఅష్టికి తీసుకొని వెళ్లి న్యాయం చేయాలని కోరారు. దీంతో ఆయన స్పందించి ప్రభుత్వం కి లేఖ రాసారు.. అమరావతి వెళ్లి అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు వివరించారు. దీంతో ప్రభుత్వం ఒక ఉన్నత కమిటీ ని నియమించింది. కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సి.కఅష్ణ(అమరావతి) నేతఅత్వంలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ఆంగ్ల సాహిత్య ప్రొఫెసర్ డి. జ్యోతిర్మయి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆర్.వి.ఎస్.ఎస్.ఎన్.రవికుమార్ సభ్యులుగా కమిటీ ని నియమిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. ఆ ప్రతులను ఎమ్మెల్యే బుధవారం అధ్యాపకులు ధర్నా శిబిరంలో అందజేశారు. న్యాయం జరుగుతుంది అని భరోసా ఇచ్చారు.
అధ్యాపకుల సమస్య కొలిక్కి వచ్చే అవకాశం : ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ కమిటీ నియామకం
