ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : ఉమ్మడి జిల్లాలలో ప్రసిద్ధిగాంచిన మండలంలోని వేమవరం గ్రామములో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానమునకు నూతన కార్యనిర్వహణాధికారిగా ఆకుల కొండలరావు, సోమవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం నందు పనిచేస్తున్న కొండలరావు సాధారణ బదిలీపై వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు ఇప్పటివరకు ఇక్కడ కార్యనిర్వహణాధికారి పనిచేయుచున్న కానూరి సురేష్ బాబు యన్.టి.ఆర్. జిల్లా , వేదాద్రి , శ్రీ లక్ష్మి నరిసింహ స్వామి దేవస్తానునకు బదిలీ అయినట్లు తెలిపారు. కొండాలమ్మ దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన కొండలరావు ను పలువురు స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. ఆలయ మర్యాదలతో ఆయనను వేద పండితులు సత్కరించారు.
