ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని మోదుకూరు, గుమ్మిలేరు పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు పెంటపాటి శ్యామల, గుణ్ణం రాంబాబు ల అధ్యక్షతన ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్ నిర్మాణానికి స్థలం ఆమోదం కోసం గ్రామ సభలు కార్యదర్శి కె.సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించి తీర్మానించారు. ఈ సందర్భంగా కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ గుమ్మిలేరు గ్రామస్తులకు నీటి సరఫరా కొరకు వాటర్ ట్యాంకు మంజూరైనట్లు తెలిపారు. అయితే ఈ వాటర్ ట్యాంకు నిర్మాణానికి అనువైన స్థలం మోదుకూరు పంచాయతీ పరిధిలో ఉన్నందున రెండు గ్రామ సభలను తీర్మానాలు చేసి స్థలం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు 3 సెంట్ల స్థలాన్ని 639 ఎల్పిఎంకు చెందిన 155/3 సర్వేనెంబర్ లో 1-258 విస్తీర్ణంలో కేటాయించినట్లు తెలిపారు. ఈ మేరకు రెండు పంచాయతీల సభ్యులు ఆమోదం తెలిపినట్లు ఆయన బుధవారం వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 5 సెక్రెటరీ పద్మావతి, సచివాలయ సిబ్బంది ఉన్నారు.