నంద్యాల అర్బన్ : ఏపీఎస్‌ఆర్టీసీ రిటైర్డ్ ఎంపాయీస్ అసోసియేషన్ సుమారు 30-35 సం?ల పాటు అతి తక్కువ వేతనములతో సర్వీసు పూర్తి చేసుకొని, రిటైర్డ్ అయిన తర్వాత పి. యఫ్ పింఛన్ నుండి 2014 ముందు రిటైర్డ్ అయిన వారికి రూ.1000, రూ.1400, ఆ తర్వాత రిటైర్డ్ అయిన వారికి రూ. 2,000 వచ్చుచున్నది. ఈ పింఛన్ ఏ మాత్రము పెరుగుట లేదు. ఈ పింఛనుతో భార్యభర్తలిరు బ్రతుకుట చాలా కష్టంగా ఉన్నదని. ఈ వయస్సులో కొంతమంది పిల్లల ఆదరణ లేక చిన్న చిన్న పనులు చేసుకొన్నప్పటికి బ్రతుకుట భారముగా ఉన్నదని. రాష్ట్ర ప్రభుత్వము వఅద్ధులకు ఇచ్చు సామాజిక పింఛను కొరకు ప్రయత్నించగా మా యొక్క ఆధార్ కార్డు నెంబరు కొట్టగానే ఉద్యోగి అని వచ్చుచున్నదని. అందువలన మాకు సామాజిక ఎన్టీఆర్ భరోసా పింఛను ఇచ్చుటకు నిరాకరించుచున్నారని. గత రాష్ట్ర ప్రభుత్వములో ఉన్న మంత్రులు ముఖ్యముగా రవాణాశాఖామాత్యులు మరియు శాసన సభాపతికి అనేకసార్లు మెమోరాండం ద్వారా విన్నవించుకొనుట జరిగినది. కాని మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని . కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ శేష ప్రజల ఆదరాభిమానము పొందిన గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అనేక సౌకర్యాలను కల్పించుచున్నారని. కావున తమరు మా యందు దయవుంచి మా యొక్క హృదయ విదారకమైన పరిస్థితులను . వారి దృష్టికి తీసుకువెళ్ళి మాకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వృద్ధులకు ఇచ్చు సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పించవలసిందిగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్‌ఎండి ఫరూక్ గారికి రిటైర్డ్ ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగస్తులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది . దీనికి మంత్రి ఫరూక్ స్పందిస్తూ ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి దఅష్టికి మరియు చంద్రబాబు నాయుడు గారి దఅష్టికి తీసుకుపోతామని సానుకూలంగా స్పందించడం జరిగింది … ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఓబులేష్ , చంద్రమౌళి , పీఎం గౌడ్ , రమణారెడ్డి , బేడ బుద్ధుడు తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను ఇప్పించాలి : మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ కు రిటైర్డ్ ఉద్యోగస్తుల వినతి
