కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలు : జడ్జి

ప్రజాశక్తి – గిద్దలూరు : కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వము ఎంతో దోహదపడుతుందని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.మేరీ సారా ధానమ్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవాది óకారసంస్థ ఆదేశాల ప్రకారం గిద్దలూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానసిక కోర్డు ఆవరణలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి మేరీ సారా ధానమ్మ అధ్యక్షతన గిద్దలూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయ వాదులకు ‘మధ్యవర్తిత్వము'(మీడియేషన్‌)పై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వము యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రస్తుత సమాజంలోని కేసులను, సమస్యలను పరిష్కరించు కోవటానికి మధ్యవర్తిత్వము ఎంతో గానో దోహదపడుతుందని తెలిపారు. కక్షిదారులు తమ కేసులను సున్నితంగా పరిష్కరించు కొనటానికి మధ్యవర్తిత్వ మార్గమును ఎంచుకోవాలన్నారు. తద్వారా తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా ఖర్చులన కూడాు తగ్గించుకోవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న సమస్యలను, వివాదాలను సత్వరమే పరిష్కరించు కొంటానికి మరియు అందరూ కలిసి పోయి, తిరిగి ప్రశాంత జీవనం కొనసాగించటానికి ఈ మధ్యవర్తిత్వ మార్గము ఎంతో దోహదపడుతుందన్నారు. కోర్డు కేసులలో కూడా 89 సిపిసి ఈ ప్రత్య మ్నాయం తెలియజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఉదయగిరి మల్లికార్జున రావు, ప్యానల్‌ న్యాయవాది కె.రవి ప్రకాష్‌ బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు

➡️