మధ్యవర్తిత్వచట్టాన్ని వినియోగించుకోవాలి

May 14,2024 23:41 #Dist judge
Dist Judge

 ప్రజాశక్తి-విశాఖపట్నం : మధ్యవర్తిత్వ చట్టాన్ని న్యాయవాదులు వినియోగించుకోవాలని విశాఖ జిల్లా న్యాయాధికార సంస్థ అధ్యక్షులు ఆలపాటి గిరిధర్‌ సూచించారు. విశాఖ జిల్లా న్యాయాధికార సంస్థ ఆధ్వర్యాన మధ్యవర్తిత్వం అంశంపై మంగళవారం అవగాహన సదస్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం వల్ల కలిగే లాభాలను వివరించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా త్వరితంగా, ఎటువంటి ఖర్చులేకుండా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సమయం వృథాకాదన్నారు. కేసులు పరిష్కారమవుతాయని చెప్పారు. పున:సమీక్షకు, అప్పీలుకు అస్కారం ఉండదని వివరించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో నష్టపరిహారం, జాతీయ లోక్‌ అదాలత్‌ తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఎం.వెంకటశేషమ్మ, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.వెంకటరమణ, కుటుంబ న్యాయస్థాన న్యాయమూర్తి కె.రాధారత్నం, జిల్లా న్యాయవాదుల సంఘం సభ్యులు బెవరా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️