ఏయూ విద్యార్థుల చిత్రకళ ప్రదర్శన

Jun 8,2024 00:10 #AU fine arts
AU Fine arts

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం చిత్రకళా విభాగంలో బిఎఫ్‌ఎ, ఎంఎఫ్‌ఎ చివరి సంవత్సరం విద్యార్థులు తమ కోర్సులో భాగంగా తయారుచేసిన వివిధ చిత్రాలు, శిల్పాలతో ఏర్పాటుచేసిన చిత్ర కళాప్రదర్శనను ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్‌ శుక్రవారం ప్రారంభించారు. శివాజిపాలెంలోని ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ తిలకించారు. ఎంతో సృజనాత్మకంగా ఆలోచిస్తూ వైవిధ్యమైన మాధ్యమాలను ఉపయోగించి చిత్రాలను తయారుచేసిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఆచార్య ఎ.నరసింహారావు, విభాగాధిపతి సింహాచలం, పూర్వ ఆచార్యులు ఆచార్య వి.రమేష్‌, ఆచార్య మహేశ్వర దాస్‌ పాల్గొన్నారు.

➡️