సమస్యలు పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ వద్ద ఆశావర్కర్ల ధర్నా

రంపచోడవరం (అల్లూరి) : ఆశ యూనియాన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సీఐటీయూ ఆద్వర్యంలో రంపచోడరం సీఐటీయూ జిల్లా కార్యాలయం నుండి ఐటీడీఏ వరకు ఆశవర్కర్లు బారిర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ముందే ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గంటపాటు నినాదాలు చేశారు.స్పందించిన పీవో కి సుమారు అరగంట పాటు ఆశ యూనియాన్‌ నాయకులు ఎదురుకుంటున్నటువంటి సమస్యలను వివరించారు.సానుకూలంగా స్పందించిన పివోకి సమస్యలతో కూడిన వినితిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆశయూనియాన్‌ జిల్లా కార్యదర్శి మట్ల,వాణిశ్రీ మాట్లాడుతూ ఆశావర్కర్ల సమస్యలు పై పరిష్కారం దిశగా కుదిరిన ఒప్పందాలు జీవోలను తొమ్మిది నెలలు కావస్తున్నా ఇంకా విడదలు కాకపోవడం ఆశావర్కర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనీ అన్నారు. ఈ మధ్యకాలలో అనేకమంది ఆశావర్కర్లను రిటైర్మెంట్‌ బేనిపిట్స్‌ లేకుండా రిటైర్మెంట్‌ చెయ్యడం వలన ఆశావర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ అన్నారు. అరవై నుండి అరవై రెండు సంవత్సరాల వయస్సు పెంపుదల జీవో రాకపోవడంతో ఆశావర్కర్లు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.అరవై ఆరు రోజులు దీక్షల్లో ఇచ్చినహమిని వెంటనే అమలు చెయ్యాలని ఆమె డిమాండ్‌ చేశారు.కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని,రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 60 వేల జీవోని వెంటనే ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వకుండా ఆశాలను బలవంతపు గిటార్మెంట్‌ చేయిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఆశా వర్కర్ల అందరికీ వేతనంతో కూడిన మేటర్నెట్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, ఏదైనా ఆశా వర్కర్‌ కి అనారోగ్య సమస్య వచ్చిన కుటుంబ అవసరాల రిచ్వగంట కానీ ఒకరోజు కానీ సెలవు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం ఆశా వర్కర్స్‌ కి కల్పించాలని, అత్యవసర సమావేశాలకు టీఏడీఏలు కచ్చితంగా చెల్లించాలని, రికార్డ్స్‌ ప్రభుత్వం ఇవ్వాలని, నాణ్యమైన సెల్‌ ఫోన్స్‌ ఆశా వర్కర్లకు ఇవ్వాలని, అన్నారు. అదేవిధంగా ఆశా వర్కర్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకత్వంతో అధికారులు కుదుర్చుకున్న ఒప్పంద జీవోలను తక్షణమే విడుదల చేయాలని జీవోలను విడుదల చేయని పక్షాన ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయకుంటే ఈ ఆందోళన దపాల వారీగా తీవ్ర ఉధఅతం చేస్తామని ఆమె ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే,శాంతి రాజు మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైనటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆశా వర్కర్లు పై కూటమి చంద్రబాబు ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆయన అన్నారు. అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికులకు కార్మికుల ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంలో ఒరిగేది ఏమీ లేదన్నారు. గత అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అనేక కార్మికులు అంగనవాడి 42 రోజులు పోరాటం అదేవిధంగా ఆశా వర్కర్స్‌ సమస్యల పరిష్కారం కోసం 66 రోజులు చేసిన పోరాటంలో అనేక ఇబ్బందులను ప్రయోగించి అంగనవాడి ఆశా వర్కర్లును అనేక ఇబ్బందులను గురి చేసిన ఫలితంగా 11 సీట్లతో సరిపెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమైన ఆశ వర్కర్‌ తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించకుంటే గతంలో అధికారానికి 9 సంవత్సరాలు దూరమైనటువంటి పరిస్థితి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు. ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి 26వేల వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కలీంకోట, రమణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి కొమరం, చెల్లాయమ్మ, ఆశ యూనియన్‌ జిల్లా నాయకులు కే రాధమ్మ, లాలీ బారు, సవీర్ల, వెంకటలక్ష్మి, పోచమ్మ, గౌరీ దేవి, వి.మార్తమ్మ, ఎస్‌, మంగయమ్మ తదితర ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.

➡️