ఫొటో : నిరసన ధర్నా చేపడుతున్న ఆశావర్కర్లు
ఆశా వర్కర్ల నిరసన ధర్నా
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు ప్రభుత్వ అర్బన్ ప్రాథమిక వైద్యశాల ఎదుట నిరసన తెలియపరచిన ఆత్మకూరు ఆశా వర్కర్లు. కలిగిరి మండలం రావులకొల్లు గ్రామంలో ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి అనే మహిళను రాజకీయ కక్షతో విధుల నుండి తొలగించారని వెంటనే ఆమెను విధులలోకి తీసుకోవాలని తెలుపుతూ సిఐటియు ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ మంగళవారం వైద్యశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఈ విషయంపై వైద్యాధికారికి విజ్ఞప్తి పత్రం అందించారు. కార్యక్రమంలో సిఐటియు ఆత్మకూరు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, కార్యదర్శి కొండమూరి హజరత్తయ్య, ఆత్మకూరు ప్రాంత ఆశావర్కర్లు హాజరయ్యారు.