ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియూ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పి ఈరన్న, ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోనిలోని సుందరయ్య భవన్‌లో జిల్లా శిక్షణ తరగతుల నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆశా వర్కర్ల సమస్యలను అధికారంలో వచ్చిన 3 నెలలకే రెగ్యులర్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని మరిచారన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇస్తానని, మెరుగైన జీవోను అమలు చేస్తానని మాట ఇచ్చి అధికారంలో వచ్చిన తరువాత మోహన్ రెడ్డి విస్మరించారన్నారు. చర్చల ద్వారా మినిట్ కాపీలో ఒప్పుకున్న డిమాండ్లను ఇంతవరకు అమలు కాలేదని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఆశ వర్కర్ సమస్యల వెంటనే పరిష్కరించాలని కోరారు. హక్కుల సాధనకై ఆశ వర్కర్లు సమిష్టిగా పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు ఈ శిక్షణ తరగతులలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు రమంజి, వీరారెడ్డి సిఐటియు పట్టణ అధ్యక్షులు తిప్పన్న, ఆశా వర్కర్లు నాయకురాలు పత్తికొండ అనిత, నందవరం మండలం శారద, ఆదోని మండలం రాజేశ్వరి,జయ లక్ష్మి, మంత్రాలయం పుష్ప, కోసిగి వెంకటలక్ష్మి, చిప్పగిరి మాధవి, అదేవిధంగా సిఐటియు మండల ఉపాధ్యక్షులు తిక్కప్ప, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
