అశోక్‌రెడ్డి సోదరి గీత ఇంటింటి ప్రచారం

Apr 18,2024 23:50 #గీత, #ప్రచారం

ప్రజాశక్తి-రాచర్ల: టిడిపి గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరి గీత గురువారం రాచర్ల మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిడిపి కూటమి అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల పింఛన్‌ ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి అందజేస్తారని తెలిపారు. రాచర్ల పంచాయతీ ఫారం, ఎస్‌పిజి పాలెం, ఏబీఎం పాలెం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి టిడిపి, జనసేన, బిజెపి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. నాడు తెలుగుదేశం హయాంలో అశోక్‌రెడ్డి గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్థానికంగా అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలంతా మే 13న జరిగే ఎన్నికల్లో స్థానిక అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️