పోలీసు లాంఛనాలతో ఏఎస్‌ఐ అంత్యక్రియలు

ప్రజాశక్తి – చీరాల: రోడ్డు ప్రమాదంలో మతి చెందిన ఏఎస్‌ఐ సంపూర్ణ రావు అంత్యక్రియలు శనివారం పేరాలలోని గాంధీ నగర్‌ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో పోలీస్‌ లాంచనాలతో నిర్వహించారు. సంపూర్ణ రావు మతి పట్ల జిల్లా ఎస్పీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బంది దురదష్టకర రీతిలో రోడ్డు ప్రమాద ఘటనలో మతి చెందడం చాలా బాధాకరమ న్నారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటా మన్నారు. చీరాల డీఎస్పీ మోయిన్‌, ఏఆర్‌ డీఎస్పీ విజయ సారథి, ఆర్‌.ఐలు, చీరాల 1వ, 2వ పట్టణ, రూరల్‌ సిఐలు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.25 వేల నగదును ఆయన సతీమణికి అందజేశారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన దొనకొండ ఎస్‌ఐ విజరు కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️