సహకార సంఘాల ద్వారా రైతుకు భరోసా

Feb 11,2024 15:34 #Kakinada, #Rythu Bandhu

ప్రజాశక్తి ఏలేశ్వరం (కాకినాడ) :సహకార సంఘాల ద్వారా రైతన్నలకు ఆర్థికంగాను, వ్యవసాయ పరంగాను భరోసా లభిస్తుందని ప్రత్తిపాడు వైసిపి కోఆర్డినేటర్ పరుపుల సుబ్బారావు అన్నారు. ఈ మేరకు లింగంపర్తి, ఏలేశ్వరం నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వరుపుల మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార వ్యవస్థ ప్రారంభమైన నాటినుండి రైతన్నల ఆర్థిక అభివృద్ధి మరింత మెరుగుపడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లింగంపర్తి పిఎసిఎస్ నూతన అధ్యక్షుడిగా వరుపుల సత్య సూరిబాబు, డైరెక్టర్లుగా కాశపు వీరబాబు, సోము సూర్యుడు, ఏలేశ్వరం పిఎసిఎస్ అధ్యక్షునిగా ఓలేటి చంటిబాబు, డైరెక్టర్లుగా దాసరి రమేష్, గూనాపు నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు వరుపుల చిట్టిబాబు, ఏలేశ్వరం సీఈవో జ్యోతుల నాగసత్య శ్రీనివాస్, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కడగల ఆదినారాయణ, కొండపల్లి ముత్యాలు, లింగంపర్తి సీఈవో విజయ్ కుమార్ రాజు, కొమ్మన సత్యనారాయణ సిబ్బంది రైతులు ఉన్నారు.

➡️