దారుణం

Jan 7,2025 21:13 #దారుణం

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ పులివెందుల నియోజక వర్గంలోని తొండూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో హంతకునిగామారి భార్య, కు మార్తెను హతమార్చిన భర్త గంగా ధర్‌రెడ్డి. నియోజకవర్గంలోని తొం డూరు మండలం తేలూరు తిమ్మలపల్లె గ్రామంలో గంగాధర్‌రెడ్డి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి(37), కుమార్తె గంగోత్రి (14)లను సోమవారం రాత్రి రాడ్డుతో కొట్టి కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. శ్రీలక్ష్మి అంగన్వాడీ కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. కుమార్తె గంగోత్రి ఎనిమిదో తరగతి చదువుతోంది. మంగళవారం శ్రీలక్ష్మి వీధిలోకి రాకపోవడంతో అంగన్వాడీ కార్యకర్త ఫోన్‌ ద్వారా ప్రయత్నించారు. ఆ సమయంలో భర్త గంగాధర్‌రెడ్డి ఫోన్‌ ఎత్తి నా భార్యను చంపేశానంటూ సమాధానం ఇచ్చాడు. విషయాన్ని స్థానికులు పోలీసులు తరఫున పులివెందుల రూరల్‌ సిఐ వెంకటరమణ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ సంఘటనపై కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.హత్యలు, ఆత్మహత్యలతో బెంబేలెత్తున్న జనం ఇటీవల కాలంలో పులివెందుల నియోజకవర్గంలో హత్యలు, ఆత్మహత్యల వరుస ఘటనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వేముల మండలం వి.కొత్తపల్లిలో జిలిటెన్‌ స్టిక్స్‌తో పేల్చి హత్య చేసిన సంఘటన మరువక ముందే, అదే గ్రామంలో ప్రేమించలేదని ఒక అమ్మాయిని 13 కత్తిపోట్లు పొడిచిన సంఘటన చోటుచేసుకుంది, సింహాద్రిపురం మండలం దిద్దికుంటలో ముగ్గురిని హత్య చేసి నాగేంద్ర అనే వ్యక్తి అతను చనిపోవడం సంచలనం రేపింది. పట్టణంలో జయమ్మ కాలనీలో భార్యాభర్తలు ఘర్షణపడి ఓ మహిళ ఉరి వేసుకుని చనిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లింగాల మండలంలో ప్రేమ పేరుతో ఓ యువకుడిని చిత్రహింస చేసి కొట్టడంతో అవమాన భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. తాజాగా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లి గ్రామంలో మద్యం మత్తులో భార్య, కుమార్తెను అతి దారుణంగా కొడవలితో నరికి చంపిన ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. వరుస సంఘటనలతో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుండడంతో ఇక్కడ ఏమైంది అనే పరిస్థితి ఏర్పడింది.

➡️