ప్రజాశక్తి – కడప ప్రతినిధి/ ఒంటిమిట్ట/కడప అర్బన్ జిల్లాలో ఓ దళితునిపై పెత్తందారు దాష్టీకం ఆలస్యంగా వెలుగు చూసింది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరుకు చెందిన కదిరి ప్రభాకర్ గంగపేరూరుకు చెందిన సమీప బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఉన్నఫళంగా కళ్లు తిరగడంతో పెన్నపేరూరుకు చెందిన చిన్నప్పగారి గజ్జెల వెంకటసుబ్బారెడ్డి ఇంటి అరుగుపై సొమ్మసిల్లిపోయాడు. దీనిపై ఆగ్రహించిన పెత్తం దారు ‘మా ఇంటి అరుగుపై పడుకుంటావా’ అంటూ కర్రతో చితక బాది, తన దుకాణంలోని సలసల కాగే నూనెను ఒంటిపై పోసిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అనంతరం భర్తను ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన భార్యను సైతం పెత్తందారు భార్య, తల్లి పరుష పద జాలంతో, కులం పేరుతో దూషించిన ఘటన మూడ్రోజుల కింద చోటు చేసుకుంది. కదిరి ప్రభాకర్ ఒళ్లంతా తీవ్రంగా కాలిన నేపథ్యంలో భార్య సహా యంతో ఇంటికి వెళ్లిపోయాడు. అర్థ రాత్రి నుంచి బొబ్బలు పెరగడం, గుండెలో దడదడ, ఒళ్లంతా మంటలు రావడం వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడు తుండడంతో భార్య గమనించి జిల్లా సర్వజనాస్పత్రిలో చేర్చింది. ఈమేరకు వైద్య చికిత్స తీసుకుంటున్నారు. శరీరంలోని గుండెలు మొదలు కుని పొట్ట, పురు షాంగాలు తీవ్రంగా కాలిపోవడంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఎక్కడికైనా తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తుండడం ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి దాపు రించింది. ఇటువంటి చిన్నపాటి ఘటనకు పెత్తందారు ఇంతటి తీవ్ర ంగా స్పందించడం వెనుక గల కారణామిటో అంతుబట్టడం లేదు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా బాధితుని కుటుంబం ఓటేయలేదనే కోపంతో ఇలా చేశారేమోనని సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.మమ్మల్నీ బకనీయండయ్యా! కాయకష్టం చేసుకుని బతికే మమ్మల్ని బత కనీయండయ్యా. శుక్రవారం ఉదయం నుంచి భోజనం చేయకపోవడంతో సాయంత్రం ఏడు గంటల సమయంలో సొమ్మసిల్లిన నేరానికి ఇంతటి శిక్ష వేయడం అమానుషం. గంగపేరూరులో తమ సమీప బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా కళ్లు తిరగడం వల్ల పెత్తందారుని అరుగు మీద పడుకున్న నేరానికి మానవత్వం లేకుండా ఇంత కఠినంగా శిక్షించడమేమిటి. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని, మెరుగైన వైద్యం కోసం ఎక్కడైనా తీసుకె ళ్లాలనే వైద్యుల సిఫారసుల నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది.-కదిరి జయమ్మ, బాధితుని భార్య, పెన్నపేరూరు.మా నాన్నను బతికించండి! ఒళ్లంతా తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న మా నాన్నను కాపాడండి. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా కళ్లుతిరిగి సొమ్మసిల్లిన నేపథ్యంలో పెత్తందారుని ఇంటి అరుగుపై పడుకుంటే ఇంత తీవ్రంగా స్పందించడాన్ని గమనిస్తే కక్ష సాధింపును తలపి స్తోంది. నిద్ర లేపడం మొదలుకుని కాయకష్టం చేసుకుని బతికే తమ నాన్నపై విచక్షణా రహితంగా చలచల కాగే నూనేతో దాడి చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది.-కదిరి సునీల్, బాధితుని కుమారుడు,పెన్నపేరూరు.హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి : సిపిఎం దళితునిపై అ రాచకపు, హేయమైన దాడికి పాల్పడిన ఒంటి మిట్ట మండలం పెన్నపే రూరు పెత్తందారు గజ్జెల వెంకట సుబ్బా రడ్డిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్ర శేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యా హ్నం జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు కదిరి ప్రభాకర్‌ను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బాధిత కుటుంబం వైసిపికి ఓటేయలేదనే కోపాన్ని మనసులో పెట్టుకుని దాడికి పాల్పడినట్లు ఉందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్ర సాద్‌రెడ్డి జోక్యం చేసుకుని, బాధితునికి మెరుగైన వైద్య సేవలు అందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయంలో ఇటువంటి హేయమైన దాడులకు పాల్పడే వారికి మరుపురాని గుర్తు ఉండేలా నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో జిల్లాలోని దళిత సెక్షన్లలను సమీకరించి కలెక్టరేట్ ఎదుట ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. ఇటువంటి అమానవీయ సంఘటన చోటుచేసుకుని సుమారు మూడ్రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకో కపోవడమేమిటని ఆక్షేపించారు. సమావేశంలో ఆయన వెంట సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, మండల నాయకులు కోనేటి నరసయ్య సహా పలువురు నాయకులు, బాధితుని బంధువులు ఉన్నారు.
