ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామంలో తల్లిపై కొడుకు గొడ్డలితో దాడిచేసిన సంఘటన సోమవారం చోటు చేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నార్నెపాటి మరియమ్మకు ఇద్దరు కుమారులు. ఆమె పెద్ద కుమారుడైన త్రిపురయ్య మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు సంతానం. వీరిద్దరినీ వాళ్ళ నాయనమ్మ అయిన మరియమ్మ పెంచి పెద్ద చేసింది. ఏడాది క్రితం అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ కాన్వాయి ఢకొీని త్రిపురయ్య మొదటి భార్య కుమారుడైన ఇశ్రాయేలు మృతి చెందడంతో ఆర్థిక సాయంగా కొంత నగదును ఇశ్రా యేలు నాయనమ్మ అయిన మరియమ్మకు వైసీపీ నాయకులు అందజేశారు. ఆ డబ్బులో తనకూ వాటా ఇవ్వాలని త్రిపుర య్య మరియమ్మను అడిగాడు. ఈ నేపథ్యంలో జరిగిన గొడ వలో త్రిపురయ్య గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గా యాలు కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను అంబు లెన్స్‌లో యర్రగొండపాలెం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
