ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : సంక్రాంతి ముసుగులో జరిగే ఆసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసి ఉద్దేశంతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో కోడిపందాలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేసేందు చీరాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు విస్తఅతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఏస్.ఐ నాగ శ్రీను కు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు స్టేషన్ సిబ్బందితో కలిసి సోమవారం కొత్తపేట ప్రసాద్ నగర్‌లోని ఒక ఇంటిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరం పై దాడి చేసి పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.4320/- నగదు సీజ్ చేశారు.
