వైసిపి మాచవరం మండల అధ్యక్షునిపై దాడి

May 15,2024 00:48

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ఎన్నికలు ముగిసినా గురజాల నియోజకవర్గంలో వైసిపి, టిడిపి మధ్య ఘర్షణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి సమయంలో మాచవరం మండలం వైసిపి అధ్యక్షుడు చౌదరి సింగరయ్య, నాయకుడు దారం లచ్చిరెడ్డిలపై టిడిపి నాయకులు దాడి చేశారు. మాచవరం తహాశీల్ధార్‌ కార్యాలయం వద్ద ఉన్న కారు ఎక్కుతుండగా కొత్తపాలెం, మరో గ్రామనికి చెందిన కొందరు వ్యక్తులు చౌదరి సింగరయ్య, దారం లచ్చిరెడ్డిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికుల వెంటనే వారిని పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో వైసిపి అధ్యక్షుడు చౌదరి సింగరయ్యకు కాలు, కుడిచెయ్యి విరిగిపోయాయి. మరో వైసిపి నాయకుడు దారం లచ్చిరెడ్డికి కుడిచెయ్యి విరిగింది. మాచవరం మండలంలోని కొత్తగణేశునిపాడులో వైసిపి వారి ఇళ్లపై జరిగిన దాడి మరవకముందే కాసు మహేష్‌రెడ్డి వాహనాలపై దాడి జరగడం మాచవరం వైసిపి నాయకులపై దాడి జరగడంతో మాచవరం ప్రజలు భయాందళనకు గురవుతున్నారు. ఈ రాజకీయ గొడవలు ఎంత వరకు దారితీస్తాయో అని భయాందోళన చెందుతున్నారు.

➡️