ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే సీతా పండ్లు అమ్మకాలపై నగర పాలక సిబ్బంది దాడులు

Nov 28,2024 18:20 #Vizianagaram

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరంలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా పురుగులతో కూడిన సీతాఫలాల విక్రయాల పై తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేశామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. ఈమధ్య మార్కెట్లో సీతాఫలాలు విరివిగా వస్తున్నాయని అయితే వాటిలో పురుగులు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈమేరకు పలువురు ఫిర్యాదు చేసిన అనంతరం తమ ప్రజారోగ్య సిబ్బందితో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. సదరు సీతాఫలాలలో పురుగులు ఉన్నట్లు గుర్తించి, వాటిని సీజ్ చేశామన్నారు. కావున అటువంటి సీతాఫలాలను మార్కెట్లో తెచ్చి విక్రయించరాదని చిరు వ్యాపారస్తులకు సూచించామన్నారు. అలాగే ప్రజలకు కూడా ఇటువంటి సీతాఫలాలు కొనుగోలు సమయంలో పురుగులు ఉన్నవి లేనివి చూసి కొనుగోలు చేయాలని చెప్పారు. పురుగులతో కూడిన సీతాఫలాలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు.

➡️