చంద్రగిరిలో అట్టహాసంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Jan 23,2025 15:17 #birthday, #fruits, #Minister Lokesh

ప్రజాశక్తి రామచంద్రపురం / చంద్రగిరి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం వ్యవస్థాపకులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు నేడు చంద్రగిరిలో అట్టహాసంగా జరిగాయి. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద బాణాసంచాల్ని పేల్చి, ఎమ్మెల్యే పులివర్తి నాని భారీ కేక్ కట్ చేసి ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ ఉన్న యువ నేత సారధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. యువగళ్ళంలో 3250 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను గుర్తించి, ప్రజలను చైతన్యవంతులు చేశారని పేర్కొన్నారు. నాడు యువగళంలో ప్రజలకు ఇచ్చిన హామీలను టిడిపి అధికారంలోకి వచ్చి మంత్రిగా హామీలను నెరవేరుస్తున్న గొప్ప యువ నాయకుడు అని అభివందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వి సుబ్రహ్మణ్యం నాయుడు, ఎస్ గౌస్ బాషా, కుమార్ రాజా రెడ్డి, దుబాసి రామ్మూర్తి, జయచంద్రారెడ్డి, వి.రమేష్ రెడ్డి, ఏజిపల్లి బాల, మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, సక్కూరిధనంజయ రెడ్డి, ఆర్ మునిరత్నం రాయల్, లంకెళ్ళ లలిత, అమ్ములు, సింగు సుధా, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఆర్ సి పురంలో ప్రజా నాయకుడు పుట్టినరోజు వేడుకలు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ప్రజా నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమలరెడ్డి, చేకూరి జనార్దన్ చౌదరి, కే నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి, అక్షయ క్షేత్రంలో ప్రత్యేక ప్రతిభావంతులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేకూరి వెంకట ప్రసాద్, రాయల చెరువు నీటి సంఘాల అధ్యక్షుడు కే అర్జున్ నాయుడు, బాదూరు కోటేశ్వర్ రెడ్డి, చెరుకూరి రవికుమార్, నాగభూషణం, కొట్టే రామిరెడ్డి. టి వెంకటేష్ రెడ్డి, ఆకా దేవరాజులు, బాబయ్య, ప్రభాకర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

➡️