అట్టహాసంగా రాజహంస పండుగ ప్రారంభం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి) : తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్‌ 2025 పక్షుల రాజహంస పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం ఉదయం ముందుగా హౌలీ క్రాస్‌ సర్కిల్‌ నుండి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో రాష్ట్ర పర్యాటక సాంస్కఅతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, జెసి.శుభం బన్సల్‌, ఆర్డీ టూరిజం రమణ ప్రసాద్‌, మాజీ మంత్రి పరసారత్నం, ప్రముఖ పారిశ్రామికవేత్త గంగ ప్రసాద్‌, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని పలు కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో, మేళ తాళాల నడుమ ఫ్లెమింగో ఫెస్టివల్‌ 2025 కార్యక్రమం జరగనున్న జూనియర్‌ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం పండుగ ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️