విశాఖ : పురుగులమందు తాగి అటెండర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విశాఖ జిల్లా భీమిలిలో జరిగింది. భీమిలి ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న ముస్తఫా సీతమ్మధార ఆర్ అండ్ బీ క్వార్టర్స్ వద్ద భార్య ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. మద్యానికి బానిసై అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ద్వారక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
