ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం బాలోత్సవాలలో బాలల నృత్యాలు అలరిస్తున్నాయి. నిన్నటి నుంచి కొనసాగింపుగా బుధవారం ఉదయం నుంచి విజయనగరం బాలోత్సవం ఆధ్వర్యంలో బాలల ఉత్సవాలు పిల్లల ఆనందాల హేళీలతో జానపదులు, శాస్త్రియ , సాంప్రదాయ పలురకాలైన నృత్య ప్రదర్శనలు చేస్తూ శ్రోతులను, చూపరులను ఆకట్టుకోవడమే కాదు బాలల చిచ్చర పిడుగులా అన్న చందంగా సాగుతుంది. అంతే వారు చేతులతో వేసిన బొమ్మలు బహుబాగుగా ఉన్నాయి. వీటికి తోడు ఆడిటోరియంలో పిల్లల చప్పట్లు తో హౌరెత్తిస్తున్నారు. నెల్లిమర్లకు చెందిన విద్యార్ధి చేసిన నృత్యం ఔరా పెద్ద నాట్యకారిణి చేసినట్టు ఉందని ముక్కున వేలు వేసుకుని ఆద్యంతం అమోఘం అపూర్వం అన్నారు.
