కొత్తపట్నం (ప్రకాశం) : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ …. సిపిఎం ఆధ్వర్యంలో కొత్తపట్నం తాసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. కొత్తపట్నం మండలంలో ఉన్న భూ సమస్యలను పరిష్కారం చేయాలని, ఉపాధి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఆటో కార్మికులకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
