విత్తన వేరుశనగను పరిశీలించిన ఏవో

May 21,2024 16:26 #anathapuram, #groundnut, #Seeds

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : మండల పరిధిలోని వేపచెర్ల, బి.యాలేరు, సనప రైతు భరోసా కేంద్రాలలో సబ్సిడీ విత్తన వేరుశనగ నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి జి.సుచరిత పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్సిడీ విత్తన వేరుశనగ నాణ్యతను పరిశీలించారు. వేరుశెనగ పంపిణీలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సకాలంలో విత్తనాలను అందజేయాలని ఆర్‌బికే సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఈవో సుజిత, ఆర్‌బికె సిబ్బంది శిల్ప, ఆశు, రూపేష్‌, రైతులు హాజరయ్యారు.

➡️