పైరవీలు చేసుకో… పనులు తప్పించుకో

Jun 11,2024 21:41

ప్రజాశక్తి – మక్కువ: ‘వడ్డించేవాడి వాడు మనవాడైతే కడబంతిలో కూర్చొన్నా ఫర్వాలేదు’ అన్న చందంగా ఉంది మండలంలోని శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వర్తిస్తుందనలో ఎటువంటి అతిశయోక్తి కాదు. పైరవీరుల్లో ప్రావీణ్యం ఉంటే ఇక్కడ ఉద్యోగం చేసినట్టే. విధులకు డుమ్మా కొడుతూ ఇంకెక్కడైనా గడిపేయవచ్చు అన్నట్లుగా కొంతమంది సిబ్బందిపై పనితీరుపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన సచివాలయ వైద్య సిబ్బంది కూడా ఇదే పంథాను కొద్దిమంది అనుసరిస్తూ విధులు నిర్వహించే వారిని అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల మార్చి 16 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన దరిమెలా ఏ విధమైన డిప్యూటేషన్లకు ఎన్నికల సంఘం అనుమతి లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇక్కడ పని చేసే ఓ సూపర్వైజర్‌ డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై ఇప్పటికీ విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. ఎక్కువ శాతం గిరిజన ప్రాంతం ఉండడంతో ఆయా గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.జీ నేపథ్యంలో ఉన్న సూపర్‌వైజర్‌ను డిప్యూటీపై వెళ్లిపోవడంతో గిరిజనులకు ఆరోగ్య సలహాలు, సూచనలు సకాలంలో ఇవ్వడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దిగువ స్థాయి సిబ్బందిని గత కొంతకాలంగా వివక్ష కొనసాగుతుందన్న చర్చ జరుగుతోంది. సిబ్బందిలో నచ్చిన వారికి ఒకలా, నచ్చనివారికి మరోలా బాధ్యతలు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అలసత్వం వల్ల సిబ్బంది ఎవర్నీ ఏమీ అనలేని దుస్థితి ఏర్పడింది. ఒకవేళ ఎవరిని ఏమన్నా ఏ విధమైన గొడవలు వస్తాయోనని సర్దుకుని పోవాల్సిన పరిస్థితి పిహెచ్‌సిలో నెలకొందన్న చర్చ వినిపిస్తుంది.ఉన్నతాధికారుల ఆదేశాలు ప్రకారమే..ఎన్నికల నిబంధనలను గురించి తనకు పెద్దగా తెలియదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే డిప్యూటేషన్‌పై సూపర్వైజర్‌ని పంపినట్లు పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. ఏమైనా పనులుంటే అక్కడ నుంచే ఇక్కడ పని చేస్తున్నారని ‘ప్రజాశక్తి కి ఆయన తెలిపారు ఎక్కడైనా నాకు ఒకటే..పనిచేసే నైపుణ్యం తన వద్ద ఉన్నందున జిల్లా కేంద్రంలో జిల్లా అధికారులు తనతో పని చేయించుకుంటున్నారని సూపర్వైజర్‌ అన్నారు. పైరవీలు చేసి తాను జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తించలేదన్నారు. పనిచేసే వారికి ఎక్కడైనా ఒకటైనను ఆమె బదులు ఇచ్చారు.

➡️