చేద్దాంప్రజాశక్తి – రాయచోటి టౌన్ తేలికంగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే హెచ్‌ఎంపివి వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య అన్నారు. గురువారం డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండి వైద్యులు సూచించిన నియమ నిబంధనలు పాటించాలని కోరారు. హ్యూమన్ మెటా న్యుమో వైరస్ 5 నుంచి 65 సంవత్సరాల ఆరోగ్యవంతులపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ఐదేళ్లలోపు చిన్న పిల్లలకు, వ్యాధి నిరోధక శక్తి లేనివారికి, దీర్ఘ కాలిక రోగులకు, వయోవద్ధులలో ఉన్నవారికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాధి కొత్త వైరస్ కాదని సాధారణ వైరస్ మాత్రమే అని దీన్ని వైద్యులు 24 సంవత్సరాల కిందటే గుర్తించారని ప్రజలు భయాందోళనలు చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులకు యాంటీబయాటిక్ మందులు పనిచేస్తాయని, చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి నుండి పూర్తిగా రక్షణ పొందవచ్చని తెలిపారు. కాబట్టి ప్రజలు తర చూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని మాస్కులు ధరించాలని, మంచినీరు ఎక్కువ తీసుకోవాలని తాజా పౌష్టికాహారం తీసుకోవడం బహిరంగ ప్రదేశాలలో మార్కెట్లలో తిరగకూడదని చెప్పారు. దగ్గు జలుబు ఉన్న వారికి దూరంగా ఉండా లని, కళ్ళు తరచూ చేతులతో తాకకుండా ఇతరులతో కరచాలనం చేయకూడదని పేర్కొన్నారు. దగ్గు జ్వరంతో బాధపడే పిల్లలను బడికి పంపకూడదన్నారు. పిల్లలకు సకాలంలో ప్రభుత్వం అందించే టీకాలు వేయించాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా సర్వేలను అధికారి డాక్టర్ రియాజ్ బేగ్, వైద్యులు పాల్గొన్నారు.