ప్రజాశక్తి-టంగుటూరు : రైతులు పురుగు మందు రహిత ఆహార ఉత్పత్తులను పండించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. జరుగుమల్లి వ్యవ సాయాధికారి కార్యాలయంలో ఆత్మ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు వత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు శిక్షణా కార్యక్రమం బాగా ఉపయోగపడుతున్నారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు, ప్రకతి వ్యవసాయంలో వినియోగించే కషాయాల తయారీకి సంబంధించిన కరదీపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ ఎం. సుబ్రహ్మణేశ్వరరావు, జిల్లా శిక్షణా కేంద్రం సమన్వయకర్త ఎస్. రామ్మోహన్, జిల్లా వనరుల కేంద్రం ఎఒలు వి. వెంకట శేషమ్మ, శైలజ, ఎడిఎ జె.వెంకటరావు, శింగరాయకొండ ఎడిఎ ఇ.నిర్మలా కుమారి, ఎఒ డి. యుగంధర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు, విఎఎలు, ప్రకతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.