జిల్లెల సంతోష్ విజితకు  డాక్టరేట్ ప్రదానం

Nov 27,2024 15:37 #Kadapa

ప్రజాశక్తి – కడప : కడపలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగంలోని పరిశోధక విద్యార్థిని జిల్లెల సంతోష్ విజితకి యోగి వేమన విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసినట్లు కళాశాల ప్రధానాచార్యులు డా. జి. రవీంద్రనాథ్ తెలిపారు.  భౌతిక శాస్త్ర విభాగంలోని పరిశోధక విద్యార్థిని జిల్లెల సంతోష్ విజితకు “ఆప్టికల్ కారక్టరైజెషన్ ఆఫ్ రేర్ ఎర్త్ అయాన్స్ డోపేడ్ బోరో ఫాస్ఫో జింక్ టంగ్‌స్టేట్ గ్లాస్సెస్” అనే అంశం మీద పరిశోధన చేసినందుకు  డాక్టరేట్ వచ్చింది. ఈమె పరిశోధనలకు భౌతిక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా.బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి పరిశోధన పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈమె పరిశోధన ఫలితాలు ఆరు పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్ లలో ప్రచురితమయ్యాయి. ఈమె హైదరాబాద్ నగరంలోని భోజ్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో భౌతికశాస్త్రం విభాగాధిపతి గా పనిచేస్తున్నారు.  ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డా. జి. రవీంద్రనాథ్  మాట్లాడుతూ కళాశాల ఆవిర్భావం నుండి ఇప్పటివరకు మొదటి మూడు డాక్టరేట్లు తమ కళాశాల పరిశోధక విద్యార్థులకు రావడం, వీరు డా.బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి  పర్యవేక్షణలో డాక్టరేట్ పొందడం కళాశాలకే గర్వకారణం అని అన్నారు. ఇప్పటివరకు డా.బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి  పర్యవేక్షణలో  8 మంది పరిశోధక విద్యార్థులు డాక్టరేట్ పొందారు.  ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డా. జి. రవీంద్రనాథ్,  అధ్యాపక బృందం ఆనందం వ్యక్తం చేసి డా.బుసిరెడ్డి సుధాకర్ రెడ్డిని,   జిల్లెల సంతోష్ విజితను అభినంధించారు.

➡️