- హైదరాబాద్‌లో అవార్డు స్వీకరించిన గారపాటి దంపతులు
ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఇంతింతై,, వటుడింతై అన్నట్లుగా చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్ఫూర్తితో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన కొత్తపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాసరావు అండదండలతో అనతికాలంలోనే జిల్లాలోనే ప్రధాన నాయకుడిగా ప్రాచుర్యం పొందారు. దేశానికి వెన్నుముకగా భాసిల్లుతున్న అన్నదాతలకు సేవ చేసేందుకు వీలుగా సాగునీటి సంఘం అధ్యక్షుడు బాధ్యతలు తీసుకుని సమర్ధవంతంగా నిర్వహిస్తూ విమర్శకుల ప్రశంసలను పొందారు. పంటకాలువలకు వన్నె తెచ్చి శివారు ప్రాంతాలకు సైతం సాగునీరు అందించి రైతు భాందవుడిగా ప్రఖ్యాతి గాంచారు. అటువంటి గారపాటి కుటుంబసభ్యుల సేవలను గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కళారంగ సంస్థ యువ ఆర్ట్స్ ధియేటర్స్ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సేవలను అందించిన ఆదర్శ దంపతులకు పలు అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలంలోని పెదపళ్లకు చెందిన గారపాటి శ్రీనివాసరావు, పద్మజ దంపతులను ప్రతిష్టాత్మకమైన స్త్రీశక్తి, సేవామూర్తుల విభాగంలో అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డును స్వీకరించిన విధానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ఆదర్శ దంపతుల అవార్డును తెలంగాణ రాష్ట్రంలోని అతిరథ మహారధుల మద్య గారపాటి దంపతులు స్వీకరించారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలోనున్న త్యాగరాయ గానసభలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈఅవార్డుల ప్రధానోత్సవం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి ఎస్.మధుసూదనాచారి, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు వెన్నెల గద్దర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎం.వెంకటేశ్వరి, ప్రముఖ నేపథ్య గాయని మధుప్రియ చేతుల మీదుగా గారపాటి దంపతులు ఉత్తమ ఆదర్శ దంపతుల అవార్డును స్వీకరించారు. తన సేవా, సామాజిక దఅక్ఫధాన్ని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన యువ ఆర్ట్స్ ధియేటర్స్‌కు గారపాటి కృతజ్ఞతలు తెలియజేశారు, భవిష్యత్‌లో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని సేవా, సామాజిక కార్యక్రమాలు చేపడతానని భరోసాను ఇచ్చారు. నా జీవన గమనానికి దిక్చూసి అయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాసరావుకు జీవితాంతం రుణపడి ఉంటానని సభికుల కరతాళద్వనుల మద్య ఉద్ఘాటించారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని పెద్దపల్లలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.