ప్రజాశక్తి- బాపట్ల : ఈనెల 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు శుక్రవారం నిర్వహించినట్లు జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాధిక్ తెలిపారు. వ్యాసరచన పోటీల్లో బాపట్ల మండలం నర్సాయపాలెం ఎస్‌పిఎ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థిని డి. ప్రత్యూష ప్రథమ స్థానం. అద్దంకి మండలం చక్రాయపాలెం జడ్‌పిహెచ్‌ఎస్ విద్యార్థి ఎ. అమత ద్వితీయ స్థానం. జె పంగులూరు మండలం కొండ మంజులూరు ఎస్‌ఆర్‌జె ఆర్‌వై జడ్‌ప ిహెచ్‌ఎస్ విద్యార్థి పవన్ గోపికష్ణ తతీయ స్థానం సాధించినట్లు ఆయన తెలిపారు. వక్తృత్వ పోటీల్లో అద్దంకి మండలం చక్రాయపాలెం జడ్‌పిహెచ్‌ఎస్ విద్యార్థిని ఎ. అమత ప్రథమ స్థానం, వేటపాలెం ఎంజెపి ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి కెవి.యశ్వంత్ ద్వితీయ స్థానం, నగరం మండలం ఉల్లిపాలెం జెడ్‌పిహెచ్‌ఎస్ విద్యార్థిని కె.దీపిక తతీయ స్థానం సాధిం చినట్లు తెలిపారు. క్విజ్ పోటీల్లో నరసాయ పాలెం ఎస్‌పిఎ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినిఎం. హనీ ,టి.కళ్యాణి ప్రథమ స్థానం, జె.పంగులూరు మండలం చందలూరు జడ్‌పిహెచ్ ఎస్ విద్యార్థిని ఎ. నందిని, ఎన్.సాహితీప్రియ ద్వితీయ స్థానం, నిజాంపట్నం జడ్‌పి హెచ్‌ఎస్ విద్యార్థి పి.సాకేత్, ఎం.లక్ష్మీధర్ తతీయ స్థానం సాధించినట్లు ఆయన తెలిపారు. విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, బాపట్ల, చీరాల ఉప విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వరు శీనివాసరావు, బాపట్ల ఎంఇఒ ఎస్. నిరంజన్ , సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు ఎ. రమాదేవి అభినందించారు.