నేత్రదానంపై అవగాహనకు ప్రచారం

Aug 30,2024 00:18 #నేత్రదానం
నేత్రదానం

ప్రజాశక్తి-పద్మనాభం: 39వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ వి.మీనాక్షి ఆధ్వర్యంలో మండలంలోని అనంతవరం పిహెచ్‌సిలో గురువారం నేత్రదానంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. నేత్రదానంపై ప్రజల్లో అపోహలు పోయి, చైతన్యం కలిగించేందుకు కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన నేత్రవైద్యశిబిరంలో 50మందికి కంటిపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధిఆకరి డాక్టర్‌ స్వప్ప, ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

అనంతవరంలో నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ

➡️