రైతులకు అవగాహన సదస్సు

Nov 26,2024 21:50
ఫొటో : మాట్లాడుతున్న బోర్డు వేలం నిర్వహణ అధికారి జి.రాజశేఖర్‌

ఫొటో : మాట్లాడుతున్న బోర్డు వేలం నిర్వహణ అధికారి జి.రాజశేఖర్‌

రైతులకు అవగాహన సదస్సు

ప్రజాశక్తి-వరికుంటపాడు : మండల కేంద్రమైన వరికుంటపాడు పొగాకు బోర్డు ఆధ్వర్యంలో రైతులకు మంగళవారం బోర్డు వేలం నిర్వహణ అధికారి జి.రాజశేఖర్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పొగాకు ధరలు ఆశించిన దానికన్నా ఎక్కువ ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఉంటాయనే ఆశతో పొగాకు రైతులు చాలా అధికంగా పొగాకు సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచ దేశాలలో పొగాకు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని, దానివల్ల డిమాండు తగ్గి నష్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పొగాకు వీలైనంత తగించుకొని పొగాకు బోర్డు అనుమతించిన మేరకే నాణ్యమైన పొగాకును పండిచాలని, మంచి నాణ్యమైన పొగాకు పండిచటం చాలా అవసరమని తెలియజేశారు. గత సంవత్సరం పండిచినట్లు నాణ్యత లేని పొగాకు (లో గ్రేడ్‌) పండిస్తే నష్టాలు చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. గత సంవత్సరం లో గ్రేడ్‌ రావటానికి చాలా కారణాలున్నాయని, నాణ్యమైన పొగాకును పెంచడానికి మెలుకులు తెలియజేశారు. కార్యక్రమంలో ఐ.టి.సి మేనేజర్‌ వెంకటేష్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఆదర్శ్‌ జగన్నాథ్‌, కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, రైతు నాయకులు ఆండ్ర నాగిరెడ్డి, ఆండ్ర శివరామిరెడ్డి, పొగాకు బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

➡️