వయోజన బిసిజి టీకాపై అవగాహన

ప్రజాశక్తి-కలకడ బిసిజి టీకాపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలం లోని మండెంవారి పల్లి, డి.గొల్లపల్లిలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు వర్గాలవారు తప్పనిసరిగా టిబి వ్యాధి రాకుండా బిసిజి టీకా చేసుకోవాలని కోరారు. ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్‌ రఫీ, టిబి పర్యవేక్షకులు నాగిరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి జయ రామయ్య మాట్లాడుతూ క్షయవ్యాధి లేని భారతదేశం లక్ష్య సాధన కొరకే వయోజన బిసిజి టీకాలు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినదని అన్నారు. డిఎంహెచ్‌ఒ ఆదేశాల మేరకు వయోజనుల బిసిజి టీకా ప్రాముఖ్యతపై డాక్టర్‌ కిషోర్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో టిబి రాకుండా ముంద స్తు నివారణ చర్యల్లో భాగంగా టీకా ఉప యోగపడుతుందని అన్నారు. మరణాల తీవ్రతను నివారిం చడంలో చాలా సురక్షితమైనదని, క్షయకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుందని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా 60 సంవత్సరాలు పైబడిన వారు, పొగపీల్చువారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు(18 సం నుంచి 60లోపు), టిబి జబ్బుతో కోలుకున్న వారు, వారి కుటుంబ సభ్యులకు, తగ్గ బరువు ఉన్నవారు టీకాకు అర్హులని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో నినాదాలు చేస్తూ ర్యాలీ, ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ, ఆరోగ్య విస్తరణ అధికారి జయరామయ్య, టిబి పర్యవేక్షకులు నాగిరెడ్డి, పిహెచ్‌ఎన్‌ సుబ్బరత్న, ఎంఎల్‌హెచ్‌పి, కె.కనకమ్మ, ఎఎన్‌ఎం వాణి, ఆశ కార్యకర్తలు గౌసియా, అనంత రాణి, రమ ణమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️