కోర్టుల్లో నిందితుల హాజరుపై అవగాహన

Nov 26,2024 21:54
ఫొటో : అవగాహన కల్పిస్తున్న ఉదయగిరి జూనియర్‌ సివిల్‌ కోర్టు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రొసిక్యూటర్‌ సుకన్య

ఫొటో : అవగాహన కల్పిస్తున్న ఉదయగిరి జూనియర్‌ సివిల్‌ కోర్టు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రొసిక్యూటర్‌ సుకన్య

కోర్టుల్లో నిందితుల హాజరుపై అవగాహన

ప్రజాశక్తి-ఉదయగిరి : అరెస్ట్‌, రిమాండ్‌లతో కోర్టుల్లో నిందితుల హాజరుపై ఉదయగిరి జూనియర్‌ సివిల్‌ కోర్టు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రొసిక్యూటర్‌ ఎన్‌ సుకన్య పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ నేరస్తులను అరెస్ట్‌ చేసిన సమయంలో పోలీసులు చట్టానికి లోబడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. సోషల్‌ మీడియా కేసులపై పోలీసులు వ్యవహరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించి కొత్త క్రిమినల్‌ చట్టాలను వివరించారు. కార్యక్రమంలో ఉదయగిరి సిఐ వెంకట్రావు, ఎస్‌ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి, దుత్తలూరు, సీతారాంపురం, వరికుంటపాడు, వింజమూరు మండలాల ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

➡️