డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన తప్పనిసరి

May 16,2024 15:45 #eluru

ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం: డెంగ్యూ వ్యాధిని అవగాహనతోనే అదుపు చేయవచ్చని తాడేపల్లిగూడెం మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి వైవి లక్ష్మణరావు తెలిపారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం ను పురస్కరించుకొని పట్టణ పరిధిలోని వీక ర్స్‌ కాలనీ, ఎన్‌.టి.ఆర్‌.జంక్షన్‌ , కదకట్ల, యాగర్లపల్లి ఆరోగ్య కేంద్రాల వద్ద డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డా.శ్రావ్య,డా అనీషా, డా.తనూజ లు మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దం అని పిలుపు నిచ్చారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు,చికిత్స అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంటాయని వీటిని ప్రజలు సద్వినియోగ పరచు కావాలని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా వ్యాధి అరికట్టుటకు అందరూ కఅషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో ఆశాలు,ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు ఇ.కాంతారావు, ఎన్‌.ప్రసాద్‌ బాబు పాల్గొన్నారు.

➡️