మాట్లాడుతున్న డాక్టర్ ఖాదర్‌కుష్టు నివారణపై అవగాహన ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:కుష్టు, క్షయ, ఎయిడ్స్ వ్యాధుల నివారణ పట్ల అవగాహన కలిగుండాలని జిల్లా లెప్రసి, ఎయిడ్స్, టిబి అధికారి డాక్టర్ ఎస్.కె ఖాదర్ వలీ సూచించారు. సోమవారం ఆయన మండలంలోని వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖాదర్ వలీ మాట్లాడుతూ క్షయ (టీబీ) వ్యాధి అనేది బ్యాక్టీ రియల్ ఇన్ఫెక్షన్ అని, ఇది సాధారణంగా ఊపిరి తిత్తులను ప్రభావితం చేస్తుందన్నారు. క్షయవ్యాధి దగ్గు, తుమ్మడం, ఉమ్మివేయడం ద్వారా గాలిలో కలుస్తుందని, తద్వారా ఆరోగ్యంవంతమైన వాళ్లకు ఈ వ్యాధి ప్రబలుతుందని తెలిపారు. ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు మంది క్షయవ్యాధి బారినపడుతున్నారని చెప్పారు. ఇక కుష్టు వ్యాధి శరీర మంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి అని చెప్పారు. ఈ వ్యాధి అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి కాదన్నారు. ఇది చర్మానికి నా డీసంబంధమైన దీర్ఘకాలికవ్యాధి అని చెప్పారు. ఇది క్షయ కారకమైన మైకో బాక్టీరియాకు దగ్గర సంబంధమైన దన్నారు. దీనిని గతంలో పెద్దరోగం లేదా పెద్ద జబ్బు అని కూడా వ్యవహరించేవారని తెలిపారు. ఎయిడ్స్ (ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం) వ్యాధి శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని తెలిపారు. ఈ వ్యాధులపై అవగాహన కలిగుండాలని సూచించారు. అనంతరం ఆయన ఆర్‌వి కండ్రిగ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ టీబి, అడల్ట్ బిసి జి, లెప్రసీ, ఇతర ఆరోగ్య కార్యక్రమాలను పరిశీ లిం చారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక, జిల్లా డిఆర్ టివి కోఆర్డినేటర్, ఏపీఎంఓ,హెచ్‌ఈ ఓ తదితరులు పాల్గొన్నారు.