అవయవ, దేహదానంపై అవగాహన

అవయవ, దేహదానంపై అవగాహన

ప్రజాశక్తి -భీమునిపట్నం : అవయవ, దేహదానంపై అఖిల భారత అవయవ దాతల సంఘం, సావిత్రీభాయి పూలే ఎడ్యుకేషనల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ డాక్టర్‌ గూడూరు సీతామహాలక్ష్మి అవగాహన కల్పించారు. శుక్రవారం స్థానిక సన్‌ స్కూల్‌లో సంబంధిత వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. .ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ ప్రతిఒక్కరూ అపోహలు వీడి, అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. అవయవ, దేహదాన చేయడం ద్వారా మరణించిన తర్వాత కూడా జీవించవచ్చని, అలాగే నలుగురి జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన, చైతన్య కలిగించేందుకు స్థానిక నీడి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ముందుకు రావడాన్ని అభినందించారు. నీడీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు రూ 5 వేలు చెక్కును సీతామహాలక్ష్మికి అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు జి కన్యాకుమారి, ఐ సురేఖ, నీడీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎం.సూర్య శ్రీనివాస్‌, కె సన్నీ, ఆర్‌ బసవ కృష్ణమూర్తి, కె సురేష్‌కుమార్‌, అరుణ్‌ కుమార్‌, సన్‌ స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ సీతామహాలక్ష్మి

➡️