వేసవి శిబిరంలో రోబోటిక్స్‌పై అవగాహన

May 21,2024 15:54 #Kakinada, #summar camp

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వరహాలయ్య పేటలోని యాసలపు సూర్యారావు భవనంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపు 11వ రోజు మంగళవారం విద్యార్థులకు రోబోటిక్స్‌ ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పించారు. మహమ్మద్‌ జమీల్‌ అలీ మిత్ర బృందం ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో రోబోటిక్స్‌పై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయుడు తాటిగడప సుబ్బారావు విద్యార్థులకు పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చి విద్యార్థులతో పద్యాలు పాడించారు. అలాగే బుద్దా శ్రీనివాస్‌, దుంగల శ్యాం కుమార్‌లు కాగితాలపై రంగు రంగుల బియ్యపు గింజలతో సీతాకోకచిలుకలను రూపొందించడంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. బాలలకు అంగనవాడీ యూనియన్‌ నాయకులు టి ఎల్‌ పద్మావతి కథలు చదవడం, కథలు చెప్పడంలో శిక్షణ ఇచ్చారు. దుంగల పూజితా సూర్యశ్రీ కరాటేలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. నీలపాల కృష్ణ కర్ర సాము లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్‌ క్లబ్‌ అధ్యక్ష ,కార్యదర్శులు కూని రెడ్డి అరుణ, రొంగల అరుణ్‌ కుమార్‌, మంజుల, అమృత, సాయి, బంగారం, మణికంఠ, నేహా, రేణుక, శ్రీజ, కె రవి, పవన్‌ తదితరులు క్యాంపు నిర్వహణలో సహాయ సహకారాలు అందించారు.

➡️